
దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 24) గణనీయంగా పెరిగింది. నిన్నటి రోజున భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ ఎగిశాయి. దీంతో నిన్ననే బంగారం కొన్నవారు అదృష్టవంతులని కొనుగోలుదారులు భావిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 పెరిగి రూ.66,600 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ. 72,650 లకు ఎగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 పెరిగి రూ.66,750 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.490 పెరిగి రూ.72,800 లకు చేరాయి. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.450 ఎగిసి రూ.66,600 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ.73,690 వద్దకు చేరాయి.
ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.67,300 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.320 పెరిగి రూ.73,420గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 ఎగిసి రూ.66,600 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ.72,650 లను తాకాయి.
వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.100 తగ్గింది. ఇక్కడ ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.86,400గా ఉంది.