భారత్‌లో టెస్లా ప్రవేశం.. మొదటి షోరూమ్‌ ఓపెన్‌ | Tesla officially arrived in India its first showroom at BKC Mumbai | Sakshi
Sakshi News home page

భారత్‌లో టెస్లా ప్రవేశం.. మొదటి షోరూమ్‌ ఓపెన్‌

Jul 15 2025 11:48 AM | Updated on Jul 15 2025 12:16 PM

Tesla officially arrived in India its first showroom at BKC Mumbai

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో ఎలాన్‌మస్క్‌కు చెందిన టెస్లా తన మొదటి షోరూమ్‌ను మంగళవారం ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి కోసం టెస్లా భవిష్యత్తు ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్లా భారత్‌లోనూ తయారీ ప్లాంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

‘టెస్లా తన వ్యాపార విస్తరణ కోసం సరైన నగరాన్ని ఎంచుకుంది. మహారాష్ట్ర భారతదేశానికి వ్యవస్థాపక రాజధానిగా కొనసాగుతోంది. 2015లో యూఎస్ పర్యటనలో భాగంగా టెస్లాలో మొదటగా ప్రయాణించాను. ఇండియాలోనూ ఇలాంటి కార్లు రావాలని భావించాను. పదేళ్ల తర్వాత అది ఇప్పుడు సాధ్యమైంది’ అని ఫడ్నవీస్‌ అన్నారు.

ఇదీ చదవండి: మధ్యతరగతి పాలిట శాపం.. విద్యా ద్రవ్యోల్బణం

కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల ధరలను కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. మోడల్ వై ఆన్-రోడ్ ధర రూ.61 లక్షలుగా తెలిపింది. రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ ధర రూ.59.89 లక్షలుగా ఉందని చెప్పింది. భారత్‌ ఇప్పటికే ప్రకటించిన ఈవీ పాలసీ ప్రకారం దిగుమతి సుంకాల తగ్గింపు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి టెస్లాకు మరింత మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వ్యక్తిగతంగా సమావేశం అ‍య్యారు. అనంతరం మోదీ, ఎలాన్ మస్క్ ఏప్రిల్‌లో ఫోన్ కాల్‌లో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement