
80 శాతం ముందజలో ఉన్నారని నిపుణులు అంచనా
వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో కంపెనీలకు నాయకత్వ వాహిస్తున్న వారికి మెరుగైన వేతనాలున్నాయని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీలను విజయపథంలో నడిపించడంలో సమర్థవంతమైన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందనేది రహస్యమేమీ కాదు. అయితే స్టార్టప్ లీడర్లు, ముఖ్యంగా టీచింగ్ రోల్స్‌లో ఉన్నవారు వేతనాల విషయంలో 80 శాతం ముందంజలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.
బోధించే నాయకుల ప్రాముఖ్యత
స్టార్టప్‌ల్లో టీచింగ్ లీడర్లు అంటే సంస్థల్లో మెంటార్‌షిప్, ఎడ్యుకేషనల్ బాధ్యతలను చేపట్టేవారు. ఈ వ్యక్తులు తమ బృందాలకు నాయకత్వం వహించడమే కాకుండా సహోద్యోగుల నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలా చేయడం ద్వారా నిరంతర అభ్యాసం, నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది. స్టార్టప్‌ల సుస్థిరతకు ఇది ఎంతో అవసరం అవుతుంది.
ఇదీ చదవండి: ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఫైనాన్షియల్ రివార్డులు
స్టార్టప్‌ల్లో టీచింగ్ లీడర్లకు ఇచ్చే ఆర్థిక రివార్డులు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బోధనా బాధ్యతలను చేపట్టే నాయకులు, అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనని ఒకే స్థాయి తోటి ఉద్యోగులతో పోలిస్తే వేతన ప్యాకేజీలపరంగా 80 శాతం ముందుంజలో ఉంటున్నారు. ఈ వేతన పెంపునకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సంస్థ విలువను పెంచడం: టీచింగ్ లీడర్లను సంస్థకు సంబంధించిన అమూల్యమైన ఆస్తులుగా పరిగణిస్తారు. ఎందుకంటే వారు టీమ్ మొత్తం అభివృద్ధికి దోహదం చేస్తారు. ఇతర ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి స్టార్టప్ పనితీరును ప్రభావితం చేస్తారు.
ప్రతిభను నిలుపుకోవడం: బలమైన టీచింగ్ లీడర్లు ఉన్న స్టార్టప్‌లు టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి, దాన్ని నిలుపుకోవడానికి మొగ్గు చూపుతాయి. ఉద్యోగులు కంపెనీ ఎదిగేందుకు సహకరిస్తూ, టర్నోవర్ వ్యయాలను తగ్గించే అవకాశం ఉంటుంది.
మెరుగైన నాయకత్వ నైపుణ్యాలు: టీచింగ్ లీడర్లు సహజంగానే అధునాతన నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఇతరులకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వారు తమ కమ్యూనికేషన్, సమస్యా పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment