టాటా హారియర్‌ ఈవీ రెడీ | Tata Harrier EV Launched in India: Prices Start at Rs 21. 49 Lakh | Sakshi
Sakshi News home page

టాటా హారియర్‌ ఈవీ రెడీ

Jun 4 2025 4:11 AM | Updated on Jun 4 2025 9:34 AM

Tata Harrier EV Launched in India: Prices Start at Rs 21. 49 Lakh

ధర రూ. 21.49 లక్షలతో మొదలు

జూలై 2 నుంచి బుకింగ్స్‌ షురూ

న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం టాటా మోటార్స్‌  ఎలక్ట్రిక్‌ కార్ల శ్రేణిని మరింతగా విస్తరించే క్రమంలో  హారియర్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ని ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 21.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి చార్జ్‌ చేస్తే 500 కి.మీ. రేంజ్‌ ఉంటుంది. జూలై 2 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయి. లైఫ్‌టైమ్‌ వారంటీ గల రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో లభిస్తుంది. ఆటో పార్క్‌ అసిస్ట్, 6 టెరెయిన్‌ మోడ్‌లు, 55 పైగా కనెక్టెడ్‌ కార్‌ ఫీచర్లు మొదలైనవి ఇందులో ఉంటాయి. 

ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌ కస్టమర్లకు ఇది ఆకర్షణీయంగా ఉంటుందని  టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర తెలిపారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ప్రతి నెలా 25,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో హారియర్, సఫారీ వాహనాలతో టాటా మోటార్స్‌కి సుమారు 25 శాతం మార్కెట్‌ వాటా ఉంది.

ఎస్‌యూవీ సెగ్మెంట్‌ ఏటా గణనీయంగా వృద్ధి చెందుతోందని, దేశీయంగా మొత్తం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో ప్రస్తుతం 54 శాతం వాటా దక్కించుకుందని చంద్ర చెప్పారు. చార్జింగ్‌ వేగం కూడా గణనీయంగా మెరుగుపడటంతో, సంప్రదాయ వాహనాలకు దీటుగా, మెరుగైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉంటున్నాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement