
దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 క్యాలెండర్ ఇయర్ ద్వితీయార్ధం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు (0.15 శాతం) లాభపడి 83,730 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఫ్లాట్గా 25,515 వద్ద ప్రారంభమయ్యాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 4 శాతం వరకు లాభపడ్డాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.24 శాతం, 0.31 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.65 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ 0.18 శాతం నష్టంతో టాప్ లూజర్‌గా నిలిచింది.
నేటి ఐపీవోలు
ఎల్లెన్ బారి ఇండస్ట్రియల్ గ్యాస్స్ ఐపీఓ (మెయిన్ లైన్ ), కల్పతరు ఐపీవో (మెయిన్ లైన్ ), గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీవో (మెయిన్ లైన్ ), శ్రీ హరే కృష్ణ స్పాంజ్ ఐరన్ ఐపీవో (ఎస్ ఎంఈ), ఏజేసీ జ్యువెల్ ఐపీవో (ఎస్ ఎంఈ) ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో విడుదల కానున్నాయి.
వందన్ ఫుడ్స్ ఐపీఓ (ఎస్ఎంఈ), మార్క్ లోయిర్ ఐపీఓ (ఎస్ఎంఈ), సెడార్ టెక్స్టైల్ ఐపీఓ (ఎస్ఎంఈ), పుష్పా జ్యువెలర్స్ ఐపీఓ (ఎస్ఎంఈ), సిల్కీ ఓవర్సీస్ ఐపీఓ (ఎస్ఎంఈ) సబ్స్క్రిప్షన్ కోసం తెరవనుండగా, నీతూ యోషి ఐపీఓ (ఎస్ఎంఈ), యాడ్కౌంటీ మీడియా ఐపీఓ (ఎస్ఎంఈ) మూడో రోజుకు ప్రవేశించనున్నాయి.
ఇండోగుల్ఫ్ క్రాప్ సైన్సెస్ ఐపీఓ (మెయిన్ లైన్), మూవింగ్ మీడియా ఐపీఓ (ఎస్ ఎంఈ), వాలెన్సియా ఇండియా ఐపీఓ (ఎస్ ఎంఈ), ఏస్ ఆల్ఫా ఐపీవో (ఎస్ ఎంఈ), ప్రో ఎఫ్ ఎక్స్ టెక్ ఐపీవో (ఎస్ ఎంఈ)లకు వీటి కేటాయింపులు ఉంటాయి.