నిన్నటి ముగింపు వద్దే ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు | Stock Market opening Rally On sptember 25 2024 | Sakshi
Sakshi News home page

Stock Market Today: నిన్నటి ముగింపు వద్దే ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Sep 25 2024 9:42 AM | Updated on Sep 25 2024 10:34 AM

Stock Market opening Rally On sptember 25 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 25,947కు చేరింది. సెన్సెక్స్‌ 26 పాయింట్లు లాభపడి 84,927 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 100.49 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.74 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.25 శాతం, నాస్‌డాక్‌ 0.56 శాతం లాభపడ్డాయి.

ఇదీ చదవండి: రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్‌ యూనిట్‌!

ఫెడ్‌ కీలక వడ్డీరేట్లను కట్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ చేస్తున్నవారిలో దాదాపు 93 శాతం మంది నష్టాల్లోనే ఉంటున్నట్లు పలు సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ ట్రేడింగ్‌ చేస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, కొత్తగా ఈక్విటీ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయాలనుకుంటున్నవారు ఈ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎంచుకోకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement