రంకెలేస్తున్న బుల్‌..లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్లు

Stock Market News in Telugu - Sakshi

జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసి రావడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఫెడ్‌ సీఈవో జాన్‌ విలియన్‌సన్‌ చేసిన వ్యాఖ్యలు, డాలర్‌ ఇండెక్స్‌ 106 స్థాయికి పతనం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పదినెలల కనిష్టానికి దిగిరావడంతో దేశీయంగా మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 

దీంతో మంగళవారం ఉదయం 11గంటలకు  సెన్సెక్స్‌ 315 పాయింట్ల లాభపడి 62822  వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 18656 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

ఇక హెచ్‌యూఎల్‌, హిందాల్కో, నెస్లా, బ్రిటానియా,సిప్లా, హీరోమోటోకార్ప్‌,టాటా స్టీల్‌, ఐటీసీ, టైటాన్‌ కంపెనీ, ఐసిఐసిఐ, అపోలో హాస్పటిల్‌, జేఎస్‌డ్ల్యూస్టీల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీపీసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, లార్సెన్‌,ఇండస్‌ ఇండ్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, యూపీఎల్‌ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top