
ఫిన్‌టెక్ కంపెనీ ‘స్లైస్’ దేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎంతో పాటు స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డు అనే పేరుతో తన ఫ్లాగ్‌షిప్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ఈ స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డుకు ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు వినియోగదారులు తమ క్రెడిట్ లైన్ నుండి డ్రాయింగ్ ద్వారా యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు.
ఇతర ప్రయోజనాలు
స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డుతో పలు ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. అన్ని లావాదేవీలపై కార్డుదారులకు 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో "స్లైస్ ఇన్ 3" ఫీచర్ కూడా ఉంది. అంటే వినియోగదారులు కొనుగోలును మూడు వడ్డీ లేని వాయిదాలుగా విభజించుకోవచ్చు. "స్లైస్ తో వినియోగదారులు తమ క్రెడిట్ కార్డును నేరుగా యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాను ఉపయోగించినట్లే దీనిని ఉపయోగించవచ్చు. క్యూఆర్ లను స్కాన్ చేయడం, స్టోర్లలో చెల్లించడం, బిల్ స్ల్పిట్, ఆన్‌లైన్ లో ఆర్డర్ వంటివి చేసుకోవచ్చు" అని స్లైస్ తెలిపింది.

యూపీఐ బ్యాంక్.. ఏటీఎం
క్రెడిట్ కార్డుతో పాటు స్లైస్ బెంగళూరులోని కోరమంగళలో యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను స్లైస్ ప్రారంభించింది. ఈ శాఖలో యూపీఐ ఏటీఎం ఉంది. ఇక్కడ వినియోగదారులు క్యాష్ విత్‌డ్రాలు, డిపాజిట్లు చేయవచ్చు. ఖాతాలను తెరవడం వంటి ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. స్లైస్ అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ బ్రాంచ్ అన్ని కస్టమర్ ఇంటరాక్షన్ లలో మొత్తం యూపీఐ ఇంటిగ్రేషన్ ను అందిస్తుంది. ఎటువంటి సుదీర్ఘ ప్రక్రియలు లేకుండా తక్షణ కస్టమర్ ఆన్‌బోర్డింగ్ చేస్తుంది.