హల్దీరామ్‌లో టెమాసెక్‌కు వాటా  | Singapore Temasek seeks CCI nod to acquire 10 percent stake in Haldiram | Sakshi
Sakshi News home page

హల్దీరామ్‌లో టెమాసెక్‌కు వాటా 

Published Tue, Mar 25 2025 5:12 AM | Last Updated on Tue, Mar 25 2025 5:12 AM

Singapore Temasek seeks CCI nod to acquire 10 percent stake in Haldiram

10 శాతం కొనుగోలుకి ఒప్పందం 

అనుమతి కోసం సీసీఐకు దరఖాస్తు 

న్యూఢిల్లీ: ప్యాక్డ్‌ స్నాక్, స్వీట్స్‌ కంపెనీ హల్దీరామ్‌ స్నాక్స్‌ ఫుడ్‌లో సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ టెమాసెక్‌ హోల్డింగ్స్‌ 10 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు అనుమతించమంటూ అనుబంధ సంస్థ జాంగ్‌సాంగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పీటీఈ ద్వారా కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ)కు దరఖాస్తు చేసింది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 10 శాతానికంటే తక్కువ వాటా సొంతం చేసుకుకోనున్నట్లు సీసీఐకి  తెలియజేసింది. షేర్లు, వోటింగ్‌ హక్కుల ద్వారా వాటా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. 

పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 10 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 85,700 కోట్లు) విలువలో హల్దీరామ్‌ స్నాక్స్‌లో 10 శాతం వాటా కొనుగోలుకి టెమాసెక్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్లాక్‌స్టోన్, అల్ఫా వేవ్‌ గ్లోబల్, బెయిన్‌ క్యాపిటల్‌ తదితర పీఈ దిగ్గజాలతో చర్చల అనంతరం టెమాసెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అగర్వాల్‌ కుటుంబ నిర్వహణలోని హల్దీరామ్‌ స్నాక్స్‌ రెస్టారెంట్లను సైతం నిర్వహించే సంగతి తెలిసిందే. 1937లో రాజస్తాన్‌లోని బికనీర్‌లో ఏర్పాటైన కంపెనీ వచ్చే ఏడాది(2025–26)లో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే ప్రణాళికల్లో ఉంది. తాజాగా అందుకోనున్న నిధులను విస్తరణకు వినియోగించే వీలుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement