రూ. 580 కోట్లతో 23 శాతం కొనుగోలు
న్యూఢిల్లీ: గ్రో అసెట్ మేనేజ్‌మెంట్(ఏఎంసీ)లో యూఎస్ అసెట్ మేనేజర్.. స్టేట్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ 23 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒకేసారి లేదా దశలవారీగా 6.5 కోట్ల డాలర్లు(రూ. 580 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా దేశీయంగా కార్యకలాపాలను పటిష్టపరచుకోనుంది. మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్‌తో వాటా కొనుగోలుకి స్టేట్ స్ట్రీట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గ్రో ఏఎంసీ వెల్లడించింది.
కాగా, స్టేట్ స్ట్రీట్.. రూ. 381 కోట్లతో సెకండరీ షేర్ల కొనుగోలుకి, తాజాగా జారీ చేయనున్న ఈక్విటీకి మరో రూ. 199 కోట్ల చొప్పున పెట్టుబడులను వెచ్చించనున్నట్లు గ్రో బ్రాండ్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ వివరించింది. అయితే ఈ లావాదేవీ పూర్తయ్యాక గ్రో ఏఎంసీలో 4.99 శాతానికి మించిన ఓటింగ్ హక్కులను పొందేందుకు కొనుగోలుదారు సంస్థకు వీలుండదు.


