ప్రియురాలిని పెళ్లాడిన సిద్థార్థ్‌ మాల్యా - ఫోటోలు | Sidhartha Mallya Marries Girlfriend Jasmine In London | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న విజయ్‌ మాల్యా కుమారుడు.. ఫోటో వైరల్‌

Jun 23 2024 3:24 PM | Updated on Jun 23 2024 3:45 PM

Sidhartha Mallya Marries Girlfriend Jasmine In London

వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు 'సిద్ధార్థ మాల్యా' శనివారం తన స్నేహితురాలు జాస్మిన్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి లండన్ సమీపంలోని ఓ విలాసవంతమైన ఎస్టేట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సిద్ధార్థ, జాస్మిన్‌ ఫ్రెండ్ జనాంగి షేర్ చేశారు.

సిద్ధార్థ మాల్యా ఎమరాల్డ్ గ్రీన్ వెల్వెట్ టక్సేడోను ధరించగా, జాస్మిన్ తెల్లటి గౌనులో కనిపించారు. తమ పెళ్లి ఉంగరాలు సంబంధించిన ఫోటోలను జాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సిద్ధార్థ మాల్యాను ట్యాగ్ చేశారు.  వివాహానికి కేవలం కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్‌ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement