యూపీఐకి క్రెడిట్ కార్డ్ లింక్‌.. లాభమా.. నష్టమా? | Should link credit card to UPI Advantages and disadvantages | Sakshi
Sakshi News home page

యూపీఐకి క్రెడిట్ కార్డ్ లింక్‌.. లాభమా.. నష్టమా?

Jan 29 2025 7:08 PM | Updated on Jan 29 2025 7:39 PM

Should link credit card to UPI Advantages and disadvantages

డిజిటల్‌ చెల్లింపులు విస్తృతమైన నేటి కాలంలో ఆన్‌లైన్ పేమెంట్స్‌ చేయడానికి క్రెడిట్ కార్డ్ అనేది శక్తివంతమైన ఆయుధం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చెల్లింపులకు అనువుగా ఉండటమే కాకుండా అనేక  రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తుంది.

అయితే ఇదే సమయంలో కార్డ్ చెల్లింపుల కంటే యూపీఐ (UPI) చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. యూపీఐ ద్వారా చెల్లింపులు గతేడాది అక్టోబర్‌లో 2.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 37 శాతం పెరినట్లు ఆర్బీఐ (RBI) తాజా డేటా తెలియజేస్తోంది.

ఈనేపథ్యంలో క్రెడిట్‌ కార్డ్‌ సౌలభ్యాన్ని, యూపీఐ సేవల సౌకర్యాన్ని మిళితం చూస్తూ క్రెడిట్ లైన్ ఆన్‌ యూపీఐ అనే సర్వీస్‌ అందుబాటులో ఉంది. దీన్ని ఇప్పటికే కొంత మంది వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల లాభమా... నష్టమా? ప్రయోజనాలేంటి.. ప్రతికూలతలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు
మామూలు యూపీఐ సర్వీస్‌ లాగా కాకుండా, వినియోగదారులు తమకు కావాల్సినప్పుడే క్రెడిట్ లైన్‌ను ఉపయోగించుకునేలా చేస్తుంది. సాధారణంగా యూపీఐ చెల్లింపు చేసిన ప్రతిసారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో నగదు తరుగుతుంది. కానీ క్రెడిట్ కార్డ్ విషయంలో ఇది జరగదు.

ప్రతి చిన్న ఖర్చుకు బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లించినప్పుడు ఆ లావాదేవీకి బ్యాంక్ ఎంట్రీ జరుగుతుంది. అదే లావాదేవీ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగినప్పుడు, క్రెడిట్ కార్డ్‌కి చెల్లింపు మాత్రమే బ్యాంక్ స్టేట్‌మెంట్‌పై ప్రతిబింబిస్తుంది. తద్వారా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ భారీగా ఉండే ఆస్కారం ఉండదు.

సాధారణంగా చాలా మంది యూపీఐ వినియోగదారులు తమ ఉన్న క్రెడిట్‌ కార్డులను పెద్ద మొత్తంలో చేసే ఖర్చులకు మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి వేర్వేరు ఖర్చుల కోసం వేర్వేరు మార్గాలను ఉపయోగించడం కంటే అన్ని చెల్లింపుల కోసం కేవలం ఒక మార్గాన్ని ఉపయోగించవచ్చు.

నష్టాలు
క్రెడిట్ లైన్ అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు చేసే ధోరణి వినియోగదారులలో ఉంటుంది. డబ్బు తక్షణమే మీ బ్యాంక్‌కి వెళ్లనప్పుడు, మీరు మీ బడ్జెట్‌ను అధికంగా పెంచుతారు. కాబట్టి, చిన్న, పెద్ద ఖర్చులన్నింటినీ మీ క్రెడిట్ కార్డ్‌కి లింక్ చేయడం వల్ల అధిక ఖర్చులు జరిగే అవకాశం ఉంది.

పెరిగిన టెక్నాలజీ కారణంగా చెల్లింపులు చాలా సౌకర్యవంతంగా మారాయి. అయితే ఏదైనా సాంకేతిక లోపం సంభవించినప్పుడు, పనులు నిలిచిపోవచ్చు. అందువల్ల, చెల్లింపులను వివిధ మార్గాల ద్వారా విస్తరించడం మంచిది.

ప్రతి బ్యాంక్ కార్డ్ యూపీఐ యాక్టివేషన్‌ను అందించదు. కాబట్టి, మీరు ఒకే కార్డ్, ఒకే సర్వీస్‌కు కట్టుబడి ఉంటే కొన్ని క్యాష్‌బ్యాక్‌లు లేదా ప్రయోజనాలను పొందలేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement