లండన్‌లో బాలీవుడ్‌ బాద్‌షా ఇల్లు.. వీడియో వైరల్‌! | Shah Rukh Khan's London house video goes viral | Sakshi
Sakshi News home page

లండన్‌లో బాలీవుడ్‌ బాద్‌షా ఇల్లు.. వీడియో వైరల్‌!

Jun 28 2024 2:01 PM | Updated on Jun 28 2024 2:29 PM

Shah Rukh Khan's London house video goes viral

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ అత్యధిక పారితోషకాలు తీసుకునే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. షారుఖ్‌కు లండన్‌లో ఉన్న ఇంటికి సంబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌లో బయటకు వచ్చింది.

షారుఖ్‌ ఖాన్‌ లండన్‌ ఇల్లు ఇదేనంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్‌ వీడియోను  పోస్ట్‌ చేశారు. 'ఇది లండన్ లోని షారుఖ్ ఖాన్ ఇల్లు' అని లండన్ లోని పార్క్ లేన్ లోని 117లో ఉన్న ఈ ఇంటి వీడియోను షేర్ చేస్తూ ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చాడు. 'ఇల్లు మొత్తం తనది కాదు.. అతని ఫ్లాట్ కింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది' అని కామెంట్స్ సెక్షన్ లో ఓ యూజర్‌ పేర్కొన్నారు. లండన్ లోని విలాసవంతమైన మేఫేర్ పరిసరాల్లో షారుఖ్‌కు అనేక ఆస్తులు ఉన్నాయని మరొకరు కామెంట్‌ చేశారు.

ఎంతకు కొన్నాడంటే..
మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్‌లో 2009లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ పార్క్ లేన్ లోని ఈ అపార్ట్ మెంట్‌ను 20 మిలియన్‌ పౌండ్లు పెట్టి కొన్నారు. భారత్‌ బయట ఒక ప్రాపర్టీ కోసం ఏ బాలీవుడ్ స్టార్ ఇంత అధిక మొత్తం వెచ్చించలేదని నివేదిక పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement