India Likely To List SCILAL This Month - Sakshi
Sakshi News home page

ఎస్‌సీఐఎల్‌ఏఎల్‌ లిస్టింగ్‌ ఈ నెలలోనే

Jun 12 2023 7:40 AM | Updated on Jun 12 2023 12:05 PM

SCILAL listing this month itself - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్‌సీఐ నుంచి విడదీసిన షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ల్యాండ్‌ అండ్‌ అసెట్స్‌ (ఎస్‌సీఐఎల్‌ఏఎల్‌) సంస్థ ఈ నెలలో స్టాక్‌ ఎక్స్చెంజీలలో లిస్ట్‌ కానుంది. విభజన ప్రక్రియ కింద ఎస్‌సీఐ (షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) షేర్‌హోల్డర్లకు ఎస్‌సీఐఎల్‌ఏఎల్‌ షేర్లు లభించనున్నాయి. 

సంస్థ లిస్టింగ్‌ తర్వాత ఎస్‌సీఐ ప్రైవేటీకరణపై స్పష్టత వస్తుందని, అటుపైన ఫైనాన్షియల్‌ బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. 2020 నవంబర్‌లో షిప్పింగ్‌ కార్పొరేషన్‌లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఎస్‌సీఐఎల్‌ఏఎల్‌ కింద విడగొట్టారు. గతేడాది మార్చి 31 నాటికి దీని విలువ రూ. 2,392 కోట్లు. ప్రస్తుతం ఎస్‌సీఐలో కేంద్రానికి 63.75 శాతం వాటాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement