ఇండియా-ఇంగ్లాండ్‌ హ్యాట్సాఫ్‌ | Satya Nadella comment on India vs England Test Series | Sakshi
Sakshi News home page

ఇండియా-ఇంగ్లాండ్‌ హ్యాట్సాఫ్‌

Aug 5 2025 1:02 PM | Updated on Aug 5 2025 1:10 PM

Satya Nadella comment on India vs England Test Series

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన టెస్టు సిరీస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసిన సిరీస్ సెంటిమెంట్‌ను సత్య హైలైట్‌ చేశారు. 25 రోజుల పాటు జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు రయ్‌ రయ్‌

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో.. ‘25 రోజులు. 5 పోరాటాలు.. స్కోర్‌ 2-2తో సమమయ్యాయి. ఇది కేవలం ఆట మాత్రమే కాదు. యుగాలపాటు నిలిచిపోయే సిరీస్‌. ఇరు దేశాలు చూపిన ధైర్యసాహసాలు, గొప్పతనానికి ఇండియా, ఇంగ్లాండ్‌కు హ్యాట్సాఫ్’ అని అన్నారు. సత్య నాదెళ్ల కామెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఇ‍ప్పటికే ఈ పోస్ట్‌ను మూడు లక్షలకుపైగా మంది నెటిజన్లు వీక్షించారు. ఈ సిరీస్‌ చివరి మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement