Sakshi News home page

కార్వీ కేసులో సెబీకి  నాలుగు వారాల గడువు: శాట్‌ 

Published Sat, Jan 13 2024 9:07 AM

Sat Rejects Axis Bank Plea On Invoking Pledged Shares - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయడానికి మార్కెట్‌ రెగ్యులేటర్, డిపాజిటరీలకు 2023 డిసెంబర్‌ 20 నుండి నాలుగు వారాల సమయం ఉందని సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) శుక్రవారం స్పష్టం చేసింది.

శాట్‌ మునుపటి ఆర్డర్‌ ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయనందుకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాకు (సెబీ) వ్యతిరేకంగా యాక్సిస్‌ బ్యాంక్‌ ట్రిబ్యునల్‌ ముందు అప్పీల్‌ చేసింది. ‘ఈ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి అప్పీలుదారు అయిన యాక్సిస్‌ బ్యాంక్, అలాగే సెబీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ), నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌లకు (ఎన్‌ఎస్‌డీఎల్‌) ఆర్డర్‌ తేదీ నుండి నాలుగు వారాల గడువు ఉందని స్పష్టం చేయబడింది’ అని శాట్‌ పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వంటి ఇతర రుణదాతలకు తాకట్టు పెట్టిన షేర్లు సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్‌ ద్వారా కార్వీ ఖాతాదారులకు బదిలీ అయ్యాయి. ఈ సెక్యూరిటీల కోసం రుణదాతలకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. యాక్సిస్‌ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లు అలాగే ఉన్నాయి. దీనిని గుర్తించిన ట్రిబ్యునల్‌.. ఆ తనఖా షేర్లను విక్రయించడానికి యాక్సిస్‌ బ్యాంక్‌కు అనుమతించింది. 2023 డిసెంబర్‌ 20 నాటి శాట్‌ ఆర్డర్‌పై డిసెంబర్‌ 30న సుప్రీంకోర్టులో సెబీ అప్పీల్‌ దాఖలు చేసింది.   

Advertisement

What’s your opinion

Advertisement