వోల్టాస్‌లో అదనపు వాటా కొనుగోలు చేసిన ఎల్‌ఐసీ  | Sakshi
Sakshi News home page

వోల్టాస్‌లో అదనపు వాటా కొనుగోలు చేసిన ఎల్‌ఐసీ 

Published Tue, Nov 8 2022 10:10 AM

Rs 635 crore additional stake buys LIC in Voltas - Sakshi

న్యూఢిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తాజాగా వోల్టాస్‌లో 2 శాతం వాటా పెంచుకుంది. బహిరంగ మార్కెట్‌ ద్వారా రూ.634.5 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ తదనంతరం వోల్టాస్‌లో ఎల్‌ఐసీ వాటా 8.884 శాతానికి ఎగసింది. ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రో-మెకానికల్‌ ప్రాజెక్టుల రంగంలో వోల్టాస్‌ నిమగ్నమైంది. 

సోమవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ, వోల్టాస్‌లో తన వాటాను 2,27,04,306 షేర్ల (6.862 శాతానికి సమానం)నుండి 2,93,95,224 (8.884 శాతం)కిపెంచుకుంది. దీంతో  ఎల్‌ఐసీ 0.84 శాతం  లాభంతో రూ.633 వద్ద, వోల్టాస్ 1.24 శాతం  క్షీణించి  రూ.834 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement