
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)తో బ్యాంకెష్యూరెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంకు వెల్లడించింది. దీనితో ఎల్‌ఐసీ టర్మ్ ప్లాన్లు, ఎండోమెంట్ పాలసీలు మొదలైన పథకాలను బ్యాంకు శాఖలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ కస్టమర్లకు అందించేందుకు వీలవుతుందని వివరించింది.
ఎల్‌ఐసీకి చెందిన 3,600 పైగా శాఖలు, శాటిలైట్ ఆఫీసులతో పాటు తమ 2,000 పైగా టచ్‌పాయింట్ల విస్తృత నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా జీవిత బీమా లభ్యతను మరింతగా పెంచవచ్చని ఆర్‌బీఎల్ తెలిపింది.