పెట్టుబడుల హోరు : రిలయన్స్‌ జోరు

 RIL shares jump over near 4 pc after Saudi Arabia PIF invests  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు  శుక్రవారం భారీ లాభాలను నమోదు చేస్తోంది.  సంస్థకు చెందిన రీటైల్‌ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో  సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్(పీఐఎఫ్‌) 9,555 కోట్ల రూపాయలు పెట్టుబడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు  క్యూకట్టారు.  దీంతో  మార్కెట్ ట్రేడింగ్‌ ఆరంభంలోనే  హై జంప్‌ చేసిన  రిలయన్స్‌  షేరు ప్రస్తుతం 4 శాతం లాభాలతో కొనసాగుతోంది. మరోఆల్‌టైం గరిష్టం వైపు దూసుకుపోతోంది.  (ముకేశ్‌.. మారథాన్‌!)
 
బిలియనీర్ ముకేశ్‌ అంబానీ నేతృత‍్వంలోని రిటైల్ విభాగం 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ .9,555 కోట్లు.  గత రెండు నెలల్లో మొత్తం నిధుల సేకరణ 47,265 కోట్ల రూపాయలకు చేరుకుంది.  మరోవైపు సెన్సెక్స్ 346 పాయింట్లు లాభంతో 41688 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లుఎగిసి 12207 వద్దకొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో  ట్రేడ్‌ అవుతున్నాయి.  (కరోనా : లక్ష కోట్ల అంబానీ సంపద ఆవిరి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top