రిలయన్స్‌ ఇషా అంబానీ మరో భారీ డీల్‌: కేకేఆర్‌ పెట్టుబడులు

Reliance Retail KKR deal  to invest Rs 2070 cr - Sakshi

భారీ పెట్టుబడులు కేకేఆర్‌ వాటా 1.42శాతానికి

100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి రిలయన్స్‌ రీటైల్‌

గతనెలలో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ బిలియన్  డాలర్ల  పెట్టుబడి

KKR invests Reliance Retail రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్  భారీ పెట్టుబడులను సాధించింది.  గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అమెరికాకు,చెందిన  KKR,  రిలయన్స్‌రీటైల్‌  వాటాను1.42 శాతానికి పెంచుకోనుంది. ఇందుకుగాను రిలయన్స్‌ రీటైల్లో రూ. 2,070 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో రిలయన్స్‌ రీటైల్‌ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 8.36 లక్షల కోట్లకు చేరిందని కంపెనీ సోమవారం ప్రకటించింది.  దీంతో ఈక్విటీ విలువ పరంగా దేశంలోని మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గత నెలలో ముఖేష్ అంబానీ రిటైల్ సామ్రాజ్యంలో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఒక బిలియన్  డాలర్ల  పెట్టుబడితరువాత ఈ ఒప్పందం జరిగడం విశేషం. 

న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ KKR  రిలయన్స్ రిటైల్‌లో 2020లో ఆర్‌ఆర్‌విఎల్‌లో 1.28 శాతం వాటాల కొనుగోలు ద్వారా రూ. 5,550 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత  కొనుగోలుతో  మొత్తం ఈక్విటీ వాటా పూర్తిగా పలచన ప్రాతిపదికన 1.42శాతానికి పెరిగింది. 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించింది. దీంతో పాటు  KKR రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం యూనిట్ అయిన జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్‌లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. (జీ20 సమ్మిట్‌: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన)

1976లో స్థాపించబడిన, KKR జూన్ 30, 2023 నాటికి  సుమారు 519 బిలియన్ల  డాలర్లు ఆస్తులను కలిగి ఉంది.  కేకేర్‌ ఫాలోఅన్‌ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ, ఇటు రిలయన్స్‌తో భాగస్వామ్యంపై KKR సహ-CEO జో బే ఈ డీల్‌పై  సంతోషం ప్రకటించారు. భారతదేశంలో నిజమైన కార్పొరేట్ లీడర్, ఇన్నోవేటర్‌.  ఈ బృందంతో భాగస్వామ్యాన్ని కొనసాగించే  అవకాశం లభించడం సంతోషమని కెకెఆర్‌లోని ఆసియా పసిఫిక్ ప్రైవేట్ ఈక్విటీ హెడ్ గౌరవ్ ట్రెహాన్ పేర్కొన్నారు.  (విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top