
రియల్టీ మార్కెట్‌లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, విభిన్న రియల్టీ ప్రాజెక్ట్‌లపై చర్చించడానికి, పెట్టుబడులను ప్రేరేపించడానికి, కొనుగోలుదారులకు కనెక్ట్ అవ్వడానికి ప్రాపర్టీ షోలు సహకరిస్తాయని తెలిపారు.
ఇటీవల హైదరాబాద్‌లో 25కు పైగా రియల్టీ డెవలపర్లు నిర్వహించిన ఓ ప్రాపర్టీ షోలో మంత్రి హాజరయ్యారు. ప్రముఖ డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. గృహ రుణాలు, ఫైనాన్సింగ్, ఆస్తి నిబంధనలపై మార్గదర్శకత్వాలను చర్చించారు. ఇందులో ఆర్థిక సలహాదారులు, ఆస్తులకు సంబంధించిన న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’