రెపోరేట్లను పెంచిన ఆర్‌బీఐ, సామాన్యులపై మరింత భారం

Rbi Hikes Repo Rate By 50 Bsp To 5.9% - Sakshi

కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్‌బీఐ కీలక నిర్ణయ తీసుకుంది. శుక్రవారం ఉదయం ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను 0.50 శాతానికి పెంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. ఈ వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మే నెల నుంచి పెంచుతూ వచ్చింది. 

తాజాగా మరో సారి పెంచడంతో బ్యాంకులు రుణగ్రస్తులకు అందించే రుణాల వడ్డీ రేట్లను పెంచనున్నాయి. తద్వారా హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌ ఇలా బ్యాంకు నుంచి తీసుకున్న లోన్లపై నెలవారీ చెల్లించే ఈఎంఐ మరింత పెరగనుంది.

బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేట్లను రెపోరేట్లు అని అంటారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రెపోరేట్లను పెంచుతూ వస్తుంది.

ఇలా మే నెలలో 0.40శాతం, జూన్‌, ఆగస్టులో 0.5శాతం, శుక్రవారం మరో 0.5శాతం పెంచాయి. కాగా, ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచిన ప్రతిసారి.. బ్యాంకులు ఇచ్చే లోన్‌లపై వడ్డీ రేట్లను పెంచే విషయం తెలిసిందే.  

చదవండి👉 చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top