రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే.. | Sakshi
Sakshi News home page

రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే..

Published Tue, Feb 20 2024 4:53 PM

Ratan Tata Biography Book Launch Postponed Again - Sakshi

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన 'రతన్ టాటా' జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రానున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. పుస్తక రచయిత 'మాథ్యూ' (Mathew) నవంబర్ 2022లో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

2022లో రతన్ టాటా బయోగ్రఫీ బుక్ విడుదలవుతుందని ఎదురుచూసే అభిమానులకు అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ తరువాత బుక్ లాంచ్ తేదీని 2023 మార్చి నెలకు మార్చారు, మళ్ళీ ఓసారి 2024 ఫిబ్రవరి అన్నారు. ఈ నెలలో కూడా బుక్ లాంచ్ సాధ్యంకాదని తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ మార్చి 30 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి.. దాతృత్వానికి మారుపేరుగా నిలిచినా రతన్ టాటాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంది. ఇటీవలే రతన్ టాటా ఏకంగా 165 కోట్ల రూపాయలతో పెంపుడు జంతువుల కోసం హాస్పిటల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా..

జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement