ల్యాండ్ రోవర్ మసారా ఎడిషన్: 12 మందికి మాత్రమే.. | Range Rover SV Masara Edition Launched At Rs 4.99 Crore In India, Check Prices And Specifications | Sakshi
Sakshi News home page

ల్యాండ్ రోవర్ మసారా ఎడిషన్: 12 మందికి మాత్రమే..

Jun 1 2025 1:40 PM | Updated on Jun 1 2025 3:15 PM

Range Rover SV Masara Edition launched at Rs 4 99 Crore

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లిమిటెడ్ ఎడిషన్ మోడల్ 'రేంజ్ రోవర్ ఎస్‌వీ మసారా'ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.99 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం 12 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే దీనిని 12 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు.

రేంజ్ రోవర్ ఎస్‌వీ మసారా.. చూడటానికి కొంత భిన్నంగా ఉంటుంది. మసారా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఇది భారతీయ సంస్కృతితో దాని లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. బానెట్, టెయిల్‌గేట్‌పై రేంజ్ రోవర్ అక్షరాలు కనిపిస్తాయి. 23 ఇంచెస్ ఆబ్లివియన్ 1077 డైమండ్ టర్న్డ్ వీల్స్‌పై గ్లోస్ డార్క్ గ్రే కాంట్రాస్ట్ & బ్లాక్ కాలిపర్స్ మొదలైనవి ఇందులో చూడవచ్చు.

క్యాబిన్ అద్భుతమైన డ్యూయల్ టోన్ థీమ్‌ కలిగి ఉంది. ఇందులో పూర్తిగా వాలుగా ఉండే సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లాయబుల్ కప్‌హోల్డర్లు, ఎస్‌వీ ఎచెడ్ గ్లాస్‌వేర్‌తో కూడిన రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్‌మెంట్ ఉన్నాయి. వీటితో పాటు 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ & పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఎస్‌వీ మసారా ఎడిషన్ 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ద్వారా 615 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.

ఇదీ చదవండి: గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement