చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు | Raghuram Rajan Warns Fed Why US Rate Hikes Are Critical for Global Markets | Sakshi
Sakshi News home page

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు

Aug 28 2026 12:05 PM | Updated on Aug 28 2026 12:05 PM

Raghuram Rajan Warns Fed Why US Rate Hikes Are Critical for Global Markets

ద్రవ్యోల్బణంపై రాజన్ హెచ్చరిక

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకపోతే తీవ్ర పర్యవసానాలు తప్పవని, అమెరికా కేంద్రీయ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తక్షణమే కీలక వడ్డీ రేట్లను పెంచాలని భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు, గ్లోబల్ మార్కెట్‌లో అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచదేశాల ఆర్థిక గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ ముందస్తుగా వడ్డీ రేట్లను పెంచి ధరల మంటను అదుపులోకి తేకపోతే ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు.

అమెరికాలోని జాక్సన్ హోల్‌లో జరిగిన ప్రతిష్టాత్మక సెంట్రల్ బ్యాంకర్ల సదస్సులో ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ తన విశ్లేషణను పంచుకున్నారు. ఫెడ్ నిర్ణయాలను సమీక్షించే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా ఉన్న ఆయన ఫెడ్ హాకిష్‌(వడ్డీ రేట్లు తగ్గింపు) ద్రవ్య విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేశారు. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా బాండ్ ఈల్డ్‌లు గత ఇరవై ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. దాంతోపాటు ఇవి మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయని పేర్కొన్నారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా పరిస్థితి చేజారక ముందే తగిన చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన నాయకత్వ లక్షణమని రాజన్ గుర్తుచేశారు. ఫెడ్ ప్రస్తుత విధానాల కంటే కఠినమైన వైఖరి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న వినియోగదారుల ధరల సూచీకి అడ్డుకట్ట వేయడానికి ఫెడ్ రేట్ల పెంపు మార్గాన్నే ఎంచుకోవాలి. ఈ ఏడాది ఆఖరు నాటికి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ద్రవ్యోల్బణ నియంత్రణ పట్ల ఫెడ్ స్పష్టమైన కార్యాచరణను ప్రకటించకపోతే అంతర్జాతీయ మార్కెట్లలో ఊగిసలాట మరింత ఎక్కువవుతుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement