ఏఐతో సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ వేగవంతం | QualiZeal Everest Group release whitepaper on AI infused quality engineering | Sakshi
Sakshi News home page

ఏఐతో సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ వేగవంతం

Nov 23 2025 9:05 AM | Updated on Nov 23 2025 9:08 AM

QualiZeal Everest Group release whitepaper on AI infused quality engineering

సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ ప్రక్రియను కృత్రిమ మేథ దన్నుతో స్మార్ట్‌గా, వేగవంతంగా మార్చేందుకు తోడ్పడేలా క్యూమెంటిస్‌ఏఐ ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు క్వాలిజీల్‌ వెల్లడించింది. సవాళ్లను వేగంగా గుర్తించేందుకు, టెస్టింగ్‌ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది.

సాఫ్ట్‌వేర్‌లో అత్యంత ముఖ్యాంశాలపై దృష్టి సారించేందుకు ఇది టెస్టర్లకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. ఈ సందర్భంగా ఎవరెస్ట్‌ గ్రూప్‌తో కలిసి ‘‘రీఇమేజినింగ్‌ ఎంటర్‌ప్రైజ్‌ క్వాలిటీ’’ పేరిట క్వాలిజీల్‌ నివేదికను విడుదల చేసింది.

ఆధునిక సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ రిస్కులను అధిగమించడంలో ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్, నిరంతరాయ పర్యవేక్షణ ఉపయోగపడే విధానాన్ని నివేదిక వివరించింది. అలాగే, ప్లాట్‌ఫాం ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసిన అజమారా క్రూయిజెస్‌ కేస్‌ స్టడీస్‌ని ఇందులో పొందుపర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement