కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ ఇండ్‌కాల్ మొబైల్ ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా ‘వూబుల్ వన్’ పేరుతో తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. తద్వారా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో నూతన దేశీయ కంపెనీ ప్రవేశించినట్లైంది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆనంద్ దుబే మాట్లాడుతూ... ‘‘కొత్త విభాగంలోకి ప్రవేశించేందుకు ఇప్పట్టికే రూ.225 కోట్ల పెట్టుబడులు పెట్టాము. పరిశోధన–అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), థర్డ్‌పార్టీ ద్వారా ఉపకరణాల తయారీ, మార్కెటింగ్, అమ్మకాల తర్వాత సేవలకు పెట్టుబడిని వినియోగిస్తున్నాము. ’’అని అన్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా మాడ్యుల్, హార్డ్‌వేర్‌లను స్వయంగా కంపెనీయే రూపకల్పన చేసింది. డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జర్ భాగాలను దేశీయ కంపెనీల నుంచి సమకూర్చుకుంటుంది.అయితే భారత్‌లో లభ్యం కాని చిప్‌సెట్‌ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.
ఆకట్టుకునే ఫీచర్లు:
వూబుల్ వన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలున్నాయి. ప్రారంభ ధరను రూ.22వేలుగా నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది.


