విద్యా వ్యవస్థలో ‘మార్పు’ తేవాలన్నదే సంకల్పం | Telangana IT Minister Sridhar Babu says change in the education system is our aim | Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థలో ‘మార్పు’ తేవాలన్నదే సంకల్పం

Nov 22 2025 5:37 PM | Updated on Nov 22 2025 6:09 PM

Telangana IT Minister Sridhar Babu says change in the education system is our aim

కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో ‘అగ్రగామి’గా తెలంగాణ

యువతకు స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై ఫోకస్

జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్‌’ లో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌:  విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయూ హెచ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్‌ - 2025’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్య మిస్తోందని వివరించారు. క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేలా ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ‘ఏఐ’లో బెంచ్ మార్క్‌ను సెట్ చేసేలా అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యంతో త్వరలోనే ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 

మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని, సమాజానికి తిరిగి ఇవ్వడం కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని అన్నారు. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలమన్నారు. జేఎన్టీయూహెచ్ లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ క్లస్టర్స్, ఇంటర్నేషనల్ మెంటార్ షిప్ నెట్ వర్క్స్, గ్లోబల్ అల్యూమ్ని కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పూర్వ విద్యార్థులను కోరారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  యువ ఇంజనీర్ల ఆలోచన విధానం మారాలని,  ఉద్యోగార్థిగా కాకుండా పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని మార్గనిర్దేశం చేశారు. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రాక్టికల్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వర రావు, రెక్టార్ డా.కె.విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement