పీఎన్‌బీ – సెయిల్‌ మధ్య ఒప్పందం | Punjab National Bank signs pact with SAIL to offer loans | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ – సెయిల్‌ మధ్య ఒప్పందం

Jul 12 2024 5:23 AM | Updated on Jul 12 2024 8:17 AM

Punjab National Bank signs pact with SAIL to offer loans

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు కంపెనీ సెయిల్‌తో ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెయిల్‌ ఉద్యోగులకు గృహ, కార్ల కొనుగోలుకు రుణాలను పీఎన్‌బీ అందిస్తుంది. అలాగే విద్యా రుణాలను సైతం తగ్గింపు రేట్లకే, ఆకర్షణీయమైన సదుపాయాలతో అందించనుంది. 

పీఎన్‌బీ కస్టమర్లను పెంచుకునేందుకు, సెయిల్‌ ఉద్యోగుల శ్రేయస్సుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పీఎన్‌బీ తెలిపింది. అవగాహన ఒప్పందంపై పీఎన్‌బీ జనరల్‌ మేనేజర్‌ (బిజినెస్‌ అక్విజిషన్‌) బిబు ప్రసాద్‌ మహపాత్ర, సెయిల్‌ జనరల్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) లావికా జైన్, సెయిల్‌ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) విక్రమ్‌ ఉప్పల్‌ సంతకాలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement