29 మంది పైలట్లు దుర్మరణం: ప్రధాన కారణం ఇదే! 

Pilot error most common cause behind crash Since 2014 RTI reply reveals - Sakshi

2014 నుంచి గత ఎనిమిదేళ్లలో జరిగిన మొత్తం 19 ప్రమాదాలు

ఎక్కువ  ఘటనలు మహారాష్ట్రలో

సాక్షి:హైదరాబాద్: విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల సమాచార సమాచారాన్ని  కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)డేటా ప్రకారం 2014 నుండి ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో 29 మంది పైలట్లు మరణించినట్లు వెల్లడించింది. 

హైదరాబాద్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాబిన్ జాకీస్ దాఖలు చేసిన సమాచార హక్కు పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ సమాచారం అందించింది. గత ఎనిమిదేళ్లలో జరిగిన మొత్తం 19 ప్రమాదాల్లో ఆరు మహారాష్ట్రలోనే జరిగాయి. ఈ ఆరు ప్రమాదాల్లో 10 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక ప్రమాదాలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. ఈ రాష్ట్రంలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు పైలట్లు మృతి చెందారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్ హన్స్ మూడు విమాన ప్రమాదాలు జరగ్గా,  ఇదే అత్యధికంగా ఆరు మరణాలకు దారితీసింది.ఈ 19 క్రాష్‌లలో చాలా వరకు ఐదు 2015లో,  నాలుగు 2020లో,  2019, 2018 సంవత్సరాల్లో ఒక్కొక్కటి  చోటుచేసుకున్నాయి. ఏఏఐబీ  వెబ్‌సైట్‌లో ఉన్న  నివేదికల ప్రకారం ప్రమాదాల వెనుక అత్యంత సాధారణ కారణం పైలట్ లోపం అని  పేర్కొంది. 

తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్‌లిద్దరూ  మరణించిన సంగతి తెలిసిందే.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top