ధంతేరస్‌ 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌

Published Tue, Oct 18 2022 3:34 PM

PhonePe Golden Days Offers on gold silver Dhanteras 2022 - Sakshi

సాక్షి, ముంబై: ధంతేరస్ 2022కి  టాప్‌ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే బంపర్‌ ఆఫర్‌ అందిస్తోంది. తన ఫ్లాట్‌ఫాం ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసిన వినియోగ దారులకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తోంది.

రానున్న ధన్‌తేరస్  సందర్భంగా గోల్డెన్ డేస్ ప్రచారంలో భాగంగా వినియోగదారుల బంగారం, వెండి కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది.  ముఖ్యంగా  బంగారం కొనుగోళ్లపై రూ. 2,500, వెండి కొనుగోళ్లపై రూ. 500 వరకు క్యాష్‌ బ్యాక్‌ను పొందవచ్చు.

క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు ఎవరు అర్హులు?
అక్టోబర్ 26 వరకు  బంగారం లేదా వెండి కొనుగోళ్లను చేసినట్లయితే, కస్టమర్‌లు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు. ధంతేరస్‌ సందర్భంగా యాప్‌లోఈ ఆఫర్‌ పొందాలంటే  రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ బంగారం ,వెండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

కస్టమర్లు 99.99 శాతం స్వచ్ఛమైన 24కె బంగారం, వెండిని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బీమా చేయబడిన డోర్‌స్టెప్ డెలివరీ అవకాశం ఉంది. లేదంటే ధృవీకృత 24కే గోల్డ్ బార్లను ఉచితం సేఫ్‌గా  డిజిటల్‌గా గ్రేడ్ గోల్డ్ లాకర్‌లో దాచుకోవచ్చు.

బంగారాన్ని ఎలా కొనుగోలు చేయాలి
ఫోన్‌పేలో సైట్ దిగువన ఉన్న వెల్త్‌ చిహ్నాన్ని ఎంచుకోండి.
బంగారం, వెండి ఏది  కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఎంచుకుని, పేమెంట్‌ పద్ధతిని ఎంచుకోవాలి. 
ఆప్షన్‌లలో 'స్టార్ట్ అక్యుమ్యులేటింగ్' లేదా  ‘బై మోర్‌ గోల్డ్‌ ఎంచుకోవాలి. ఆ తరువాత డోర్‌ డెలివరీ  కావాలనుకుంటే ఆ ఆప్షన్‌ ఎంచుకోవాలి.  
చివరగా మీరుకొనాలనుకునే బంగారు లేదా వెండి నాణేలను క్లిక్ చేయవచ్చు. సంబంధిత నగదును నమోదు చేసి 'ప్రొసీడ్'  బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

Advertisement
 
Advertisement