పెన్షన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త! | Sakshi
Sakshi News home page

పెన్షన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త!

Published Mon, Jun 19 2023 8:00 PM

Pension Fund Regulator Pfrda Is Planning To Introduce A Systematic Withdrawal Plan - Sakshi

పెన్షన్‌ లబ్ధిదారలకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) శుభవార్త చెప్పింది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షన్‌ దారులు వారి నిర్ణయం ప్రకారం.. ఎంత నగదు కావాలనుకుంటే అంత నగదు విత్‌ డ్రా చేసుకోవచ్చని పీఎఫ్‌​ఆర్‌డీఏ చైర్మన్‌ దీపక్‌ మొహంతీ తెలిపారు. 

సిస్టమెటిక్‌ విత్‌డ్రా ప్లాన్‌లో భాగంగా 60 ఏళ్ల నుంచి 75 ఏళ్లలోపు నేషన్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) పెన్షన్‌ దారులు ఒకనెల, మూడు నెలలు, ఆరు నెలలు డబ్బుల్ని డ్రా చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 

ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ దారులు 60 ఏళ్ల తర్వాత తన రీటైర్మెంట్‌ సొమ్మును మొత్తం డ్రా చేసుకునేందుకు వీలు లేదు. కేవలం 60 శాతం మాత్రమే ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ఏడాదికి కొంత మొత్తాన్ని తీసుకునే సౌకర్యం ఉంది.

తాజాగా, ఆ పథకంలో మార్పులు చేస్తున్నామని.. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు దీపక్‌ మొహంతీ పేర్కొన్నారు. ఇక, ఈ మార్పులతో ఎవరైతే 60 శాతం పెన్షన్‌ను ఒకేసారి తీసుకునేందుకు ఇష్టపడని వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దీంతో పాటు, ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన వారు 70 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. ఇప్పుడు ఆ కాలాన్ని మరో ఐదేళ్లు అంటే 75ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  

చివరిగా :: దేశంలోని పెన్షన్‌ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్‌ఆర్‌డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి  స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్‌ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్‌పీఎస్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

చదవండి :  సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!

Advertisement
Advertisement