ఐఫోన్ 16పై పేటీఎం సీఈఓ విమర్శలు | Paytm CEO Vijay Shekhar Sharma Criticized The iPhone 16 Camera Performance | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 16పై పేటీఎం సీఈఓ విమర్శలు

Jan 23 2025 11:46 AM | Updated on Jan 23 2025 11:55 AM

Paytm CEO Vijay Shekhar Sharma Criticized The iPhone 16 Camera Performance

మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' యాపిల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంఘటన మరువక ముందే.. పేటీఎం కో ఫౌండర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'విజయ్ శేఖర్ శర్మ' ఐఫోన్ 16 మీద విమర్శలు కురిపించారు.

''ఐఫోన్ 16లో కెమెరా (సాఫ్ట్‌వేర్/యాప్) చాలా దారుణంగా ఉంది. నేను ఇప్పుడు పిక్సెల్ గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఇలాంటి అనుభవం ఎదురైందా'' అని పేటీఎం సీఈఓ తన ఎక్స్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

విజయ్ శేఖర్ శర్మ పోస్ట్‌పై మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ పర్మీందర్ సింగ్ స్పందించారు. కెమెరా లేదా యాప్‌లో ఏదో తప్పు ఉందని ఆయన అన్నారు. ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. పిక్సెల్ అద్భుతంగా ఉందని అన్నారు.

గూగుల్ పిక్సెల్ ఫోన్ చాలా అద్భుతంగా ఉంది. కెమెరా క్వాలిటీ కూడా ఇతర ఫోన్‌ల కంటే బాగానే ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ ఫోన్ లేటెస్ట్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఐఫోన్ 16 కంటే కూడా ఉత్తమంగా ఉందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement