అదిరిపోయే డిజైన్‌లతో విడుదల కానున్న ఒప్పో రెనో 11 సిరీస్‌ ఫోన్‌లు | Sakshi
Sakshi News home page

అదిరిపోయే డిజైన్‌లతో విడుదల కానున్న ఒప్పో రెనో 11 సిరీస్‌ ఫోన్‌లు

Published Sun, Dec 31 2023 2:19 PM

Oppo to launch Reno 11 series in India - Sakshi

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఒప్పో రెనో 11 సిరీస్‌ను త్వరలో విడుదల చేయనుంది.  జనవరి 11 న ఒప్పో రెనో 11 , ఒప్పో రెనో 11 ప్రోలను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. 

 ఇప్పటికే ఒప్పో రెనో 11 సిరీస్‌ ఫోన్‌ ఫీచర్లను ఒప్పో రెనో 11 ప్రో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ తో, అలాగే ఒప్పో రెనో 11 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో అందుబాటులోకి రానుంది.  
 
5జీ సపోర్ట్‌తో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,6.74 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 12 జీబీ ర్యామ్ ప్లస్‌ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్ ప్లస్‌ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ వస్తుంది. ఫోన్‌ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Advertisement
Advertisement