ముకేశ్‌ అంబానీ బాటలోనే.. 

No salary for Mukesh Ambani children only fee for attending board meets says RIL resolution - Sakshi

ఆకాశ్, ఈషా, అనంత్‌.. 

జీతాలు తీసుకోకుండానే బాధ్యతలు 

బోర్డ్‌ సమావేశాలకు ఫీజులు మాత్రమే 

న్యూఢిల్లీ: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్‌ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్‌ అందుకోను న్నారు.ముకేశ్‌ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్‌ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్‌ గడ్కరీ కీలక సూచనలు

నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్‌ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్‌ఐఎల్‌ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్‌ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్‌ అందుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్‌ఐఎల్‌ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్‌ ఆర్‌ఐఎల్‌ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్‌ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్‌ఐఎల్‌ పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top