డెలాయిట్‌ రాజీనామాకు సరైన కారణాలు లేవు | No reasons for Deloitte resignation | Sakshi
Sakshi News home page

డెలాయిట్‌ రాజీనామాకు సరైన కారణాలు లేవు

Aug 14 2023 6:31 AM | Updated on Aug 14 2023 6:31 AM

No reasons for Deloitte resignation - Sakshi

న్యూఢిల్లీ: ఆడిటింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సంబంధించి డెలాయిట్‌ చెబుతున్న కారణాలు సహేతుకంగా, నమ్మశక్యంగా లేవని అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) వ్యాఖ్యానించింది. ఈ అంశంపై స్టాక్‌ ఎక్సే్చంజీలకు 163 పేజీల వివరణ సమరి్పంచింది. డెలాయిట్‌ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌తో తమ నాయకత్వం నిర్వహించిన సమావేశాల్లో గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్‌ కంపెనీల ఆడిటింగ్‌ వ్యవహారాలపై డెలాయిట్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

అయితే, ఇతర సంస్థలన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవైనందున.. వాటిల్లో నియామకాల విషయంలో సిఫార్సులు చేయడమనేది ఆడిటర్‌ పరిధిలో ఉండదని డెలాయిట్‌కు తాము స్పష్టం చేసినట్లు వివరించింది. ఆడిటర్‌గా కొనసాగేందుకు డెలాయిట్‌ ఇష్టపడకపోవడం వల్ల సామరస్యంగా క్లయిట్‌–ఆడిటర్‌ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు తెలిపింది. డెలాయిట్‌ రాజీనామా వల్ల ఆరి్థక ఫలితాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది.

వివాదాస్పద హిండెన్‌బర్గ్‌ నివేదిక పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీలకు సంబంధించి కొన్ని లావాదేవీలపై డెలాయిట్‌ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌లోని ఇతరత్రా సంస్థలకు తాము అధికారిక ఆడిటర్లుగా లేనందున తక్షణం ఏపీసెజ్‌ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆగస్టు 12న ప్రకటించింది. దీంతో ఏపీసెజ్‌ ఎంఎస్‌కేఏ అండ్‌ అసోసియేట్స్‌ను ఆడిటర్‌గా నియమించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement