అమ్మానాన్నల కోసం కార్పొరేట్‌ ఉద్యోగం వదులుకొని! | Indian-origin woman leaves Deloitte job in Canada to care for elderly parents | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నల కోసం కార్పొరేట్‌ ఉద్యోగం వదులుకొని!

Sep 27 2026 5:10 AM | Updated on Sep 27 2026 5:10 AM

Indian-origin woman leaves Deloitte job in Canada to care for elderly parents

– ఒక కూతురు త్యాగం

కెనడాలో ఆరు సంవత్సరాలు గడిపి, డెలాయిట్‌లో తన కెరీర్‌ నిర్మించుకున్న ప్రీతి బిస్నిక్‌ స్వదేశానికి తిరిగి రావాలనుకుంటోంది. దీనికి కారణం...ఉద్యోగం కోల్పోవడం కాదు. అవకాశాల కొరత అంతకంటే కాదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాలనుకోవడమే కారణం. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీతి పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. ప్రశంసలు అందుకుంది.

 తన తల్లిదండ్రులకు వయసు పైబడుతోందని, వారికి అందుబాటులో ఉండడానికే ఇండియాకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పింది ప్రీతి. ప్రీతి తల్లికి గ్లాకోమా ఉంది. నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ‘పోషకాహారం గురించి చదువుతున్నప్పుడు నా తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. నేను తెలుసుకున్న విషయాలను నా తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవాలనుకున్నాను’ అంటున్న ప్రీతి తన తల్లిదండ్రులకు పోషకాహారం, ఫిట్‌నెట్‌ కోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంది. 

నెటిజనులు ప్రీతి నిర్ణయంపై ప్రశంసల వర్షం కురించారు. ఒకరు మాత్రం... ‘మీరు ఇక్కడికి రావడానికి బదులు, తల్లిదండ్రులనే మీ దగ్గరికి తీసుకెళ్లవచ్చు కదా?’ అని సలహా ఇస్తే... ‘ఆరోగ్యం దృష్యా›్ట వారిని ఇక్కడికి తీసుకురావడం అంత సులువు కాదు’ అని తెలియజేసింది ప్రీతి. గమనించాల్సిన విషయమేమిటంటే... తల్లిదండ్రులకు తాను ఏకైక సంతానం కాదు. ఆమె సోదరులు అమెరికా, లండన్‌లో స్థిరపడ్డారు. ‘నా కెరీర్‌ బాగుంటే చాలు’ అనుకునే ఈరోజుల్లో తల్లిదండ్రుల కోసం ఉద్యోగం త్యాగం చేయడం గొప్ప విషయమే కదా!’ ముక్తకంఠంతో అంటున్నారు నెటిజనులు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement