‘రుద్ర’ పైలట్‌గా... హన్స్‌ జా శర్మ | Indian Army first woman Captain Hansja Sharma qualified to fly the Rudra armed helicopter | Sakshi
Sakshi News home page

‘రుద్ర’ పైలట్‌గా... హన్స్‌ జా శర్మ

Sep 27 2026 5:04 AM | Updated on Sep 27 2026 5:04 AM

Indian Army first woman Captain Hansja Sharma qualified to fly the Rudra armed helicopter

జమ్మూకు చెందిన 27 ఏళ్ల కెప్టెన్‌ హన్స్‌జా శర్మ భారత సైనికచరిత్రలో సరికొత్త అ«ధ్యాయాన్ని రాశారు. ఇండియన్‌ ఆర్మీకి చెందిన సాయుధ హెలికాప్టర్‌ ‘రుద్ర’ను నడిపే అర్హత సాధించిన తొలి మహిళా పైలెట్‌గా ఆమె చరిత్రకెక్కారు. నాసిక్‌లోని కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో జరిగిన అత్యంత కఠినమైన శిక్షణలో టాపర్‌గా నిలిచి, ప్రతిష్ఠాత్మక ‘సిల్వర్‌ చీతా ట్రోఫీ’ అందుకున్న తొలి మహిళగా హన్స్‌జా రికార్డు సృష్టించారు.

తన ప్రయాణం అంత సులువు కాదు...  
‘హన్స్‌జా జర్నీ అంత సులువు కాదు. వృత్తి రీత్యా జర్నలిస్ట్‌గా ఉంటూ సింగిల్‌ మదర్‌గా నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నా. నా కూతురు కెరీర్‌ కోసం ఉన్నదంతా అమ్మేశా. చిన్నప్పటి నుంచే హన్స్‌జా ఫ్లైయింగ్‌ అంటే ఆసక్తి చూపేది. తన గది గోడలపై కూడా నిన్ను నువ్వు కఠినంగా పరీక్షించుకో..అని రాసుకునేది. రిక్రూట్‌మెంట్‌ సమయంలో మెడికల్‌ గ్రౌండ్స్‌లో ఒకసారి టెంపరరీ రిజెక్షన్‌కు గురైంది. కాని పట్టుదలతో 15 రోజుల్లోనే ముక్కుకి సర్జరీ చేయించుకుని పరీక్షలను ఎదుర్కొని సెలెక్ట్‌ అయ్యింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడింది ’
– రుష్మి శర్మ, హన్స్‌ జా శర్మ తల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement