Genz కూతురూ జిందాబాద్‌ | Sakshi interview with Faria Abdullah on Daughters Day | Sakshi
Sakshi News home page

Genz కూతురూ జిందాబాద్‌

Sep 27 2026 4:28 AM | Updated on Sep 27 2026 4:28 AM

Sakshi  interview with Faria Abdullah on Daughters Day

నేడు డాటర్స్‌ డే

మీ కూతురు ఇప్పుడుసినిమాల్లోని కూతురు కాదు. వంటింటి క్యారెక్టర్‌ కాదు. ఆమె ఇప్పుడు కోడ్‌ రాస్తుంది, కంటెంట్‌ రాస్తుంది,  కంపెనీని నడుపుతుంది. ఆమెకు ‘పెళ్లి ఎప్పుడు?’ అనే ప్రశ్న కంటే  ‘నెక్స్‌›్ట΄్లాన్‌ ఏంటి?’ అనే ప్రశ్నే నచ్చుతుంది. ఆమెకు స్వేచ్ఛ కావాలి, కానీ భద్రత కూడా కావాలి. ప్రేమ కావాలి, కానీ సొంత స్పేస్‌ కూడా కావాలి.  

కూతురి ఫోన్‌ చెక్‌ చేయడం మానేసి, ఆమె ఫాలో అవుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోండి.  ఒకప్పుడు కూతురిని కాపాడటం అంటే ఇంట్లో పెట్టడం. ఇప్పుడు ప్రపంచంలోకి ధైర్యంగా పంపడం. ఈ డాటర్స్‌ డే రోజున ఆమె పై మీ నమ్మకాన్నే ‘గిఫ్ట్‌’గా ఇవ్వండి. మిగిలిన గిఫ్టులన్నీ  ఆమె కొనుక్కోగలదు. ఎందుకంటే జెన్‌ జి కూతురు ప్రిన్సెస్‌ కాదు, సీఈఓ. ఈ కాలం కూతురా...వర్థిల్లు.

డాడ్‌ మామ్‌
‘‘ప్రతి సమస్యకు పరిష్కారం కూర్చుని మాట్లాడుకోవడమే’’ అంటున్నారు హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా. తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఆమె ఇలా అన్నారు. చిన్నప్పుడు ఫరియా పేరెంట్స్‌ ఆమె అల్లరి చేస్తే.. తిట్టింది లేదు... కొట్టింది లేదు. మరేం చేశారంటే... కూతుర్ని కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడారు... కోపాన్నీ ప్రదర్శించారు. ‘‘ఆ మాటలే నేను పరిణతి ఉన్న అమ్మాయిని కావడానికి ఉపయోగపడ్డాయి’’ అని చెప్పారు ఫరియా అబ్దుల్లా. ‘డాటర్స్‌ డే’ సందర్భంగా తన తల్లిదండ్రుల గురించి ఫరియా అబ్దుల్లా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.

ఈరోజు నేనీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మై డాడ్‌ అండ్‌ మామ్‌. ఇద్దరూ నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్లడానికి రెండు విభిన్నమైన కోణాలను నేర్పించారు. నాన్న నాకు సైన్స్, ప్రపంచం, మతం, సైకాలజీ, ఫిలాసఫీ వంటివన్నీ నేర్పించారు. మా అమ్మ నాకు ఎనర్జీ. ఆమె నాకు లవ్, కైండ్‌నెస్, సానుభూతి వంటివి నేర్పించారు. ఈ రెండూ కలిసి నన్ను ఒక మంచిæ వ్యక్తిగా తీర్చిదిద్దాయి.

నాన్నతో నెల రోజులు మాట్లాడలేదు
మా అమ్మా నాన్న మీద నా ప్రేమను తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నా ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే నన్ను నేను బ్యాడ్‌ డాటర్‌ అనుకుంటాను. ఎందుకంటే నేను పనులేమీ చేయను. కోపంగా ఉన్నప్పుడు రూడ్‌గా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఒకసారి నాన్న, నేను గొడవపడి నెల రోజులు మాట్లాడుకోలేదు. ఆ టైమ్‌లో నేను చాలా ఏడ్చాను. నేను అచ్చంగా మా నాన్న ఈగో క్లాష్‌ అయి, ‘నువ్వు మాట్లాడవా, నేను కూడా మాట్లాడను’ అనే జోన్‌లోకి వెళ్ళి ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కలిసిపోయాం. అది మినహా మా మధ్య ఎప్పుడూ ఇష్యూస్‌ లేవు. అయితే ఇంకా మంచి కూతురిగా నేను ఉండొచ్చేమో అనిపిస్తుంటుంది. ట్రై చేస్తాను.

నా చిరాకు కూడా వాళ్లకు ప్రేమే!
మా అమ్మా నాన్న చూపించే లవ్‌ ‘అన్‌ కండిషనల్‌’. నా చిరాకులు, బ్యాడ్‌ మూడ్స్, మూడ్‌ స్వింగ్స్‌... అన్నింటినీ ఓపికగా భరిస్తారు. ఎలా హ్యాండిల్‌ చేస్తారు? వాళ్లూ మనుషులే కదా అనిపిస్తుంటుంది. అందుకే నేను బ్యాడ్‌ మూడ్‌లో ఉన్నప్పుడు అదేం బయటపెట్టకుండా వాళ్లకు దూరంగా ఉండాలనుకుంటాను. కానీ నేను చూపించే చిరాకు కూడా వాళ్లకు ప్రేమ అనిపిస్తుంది. మా పేరెంట్స్‌ నన్ను ఎప్పుడూ కొట్టలేదు. కనీసం నా మీద ఎప్పుడూ చెయ్యి ఎత్తలేదు. ఏదైనా సరే మాటలతో చెప్పడమే. అందుకే నా మనసుకి బాగా పట్టాయి. చాలా మెచ్యూర్డ్‌గా పెంచారు. ఆ పెంపకానికి కృతజ్ఞురాలిగా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ మా పేరెంట్స్‌ పెంపకం సరిగ్గా లేకపోయి ఉంటే∙వయలెంట్‌ పర్సన్ గా మారిపోయేదాన్నేమో   (నవ్వుతూ).  

నీ జర్నీ... నీ ఇష్టం అన్నారు
చిన్నప్పటి నుంచే నేను ఒక ఆర్టిస్టిక్, క్రియేటివ్‌ పర్సనాలిటీ అని మమ్మీ, డాడీకి  అర్థమైపోయింది. సో... ఆర్టిస్ట్‌ అవ్వాలనుకుంటున్నాననే నా నిర్ణయాన్ని ఎప్పుడు చెబుతానా అని వాళ్లు ఎదురు చూశారు. కాలేజ్‌ అయిపోయాక, ‘ఓకే, ఇప్పుడు నువ్వు కెరీర్‌ విషయంలో సీరియస్‌గా ఉన్నావా లేదా కెరీర్‌కి సంబంధించిన నిర్ణయాన్ని నువ్వే తీసుకోవాలి’ అని చెప్పారు. అయితే ఆ విషయంలో నన్ను ఎప్పుడూ ఫోర్స్‌ చేయలేదు. ఇప్పుడు కూడా నేను ‘ఇది చేయను’ అని చెప్తే, ‘ఓకే’ అంటారు.

 ‘ఇది నీ జర్నీ... నీ ఇష్టం’ అనేలానే నన్ను పెంచారు. అలా ఇష్టాన్ని నా మీద వదిలేయడానికి కారణం వాళ్ల పెంపకం మీద వాళ్లకి ఉన్న నమ్మకం... వాళ్లు ఇచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేయనని నమ్మకం. మనం ఎలాంటి వ్యక్తులుగా ఎదుగుతాం అనేది చాలావరకూ మన పేరెంట్స్‌ పెంపకాన్ని బట్టే ఉంటుంది. ఆ విషయంలో నా పేరెంట్స్‌ ‘బెస్ట్‌’. నా కోసం టైమ్‌ కేటాయించి, ‘లైఫ్‌ అంటే ఇలా ఉంటుంది... ఇలా ఉండాలి’ అని వివరంగా చెప్పడంతో పాటు విలువలు కూడా నేర్పించారు. అందుకే నేను కూడా ‘బెస్ట్‌’ (నవ్వుతూ)...

అమ్మని ప్రపంచం మొత్తం తిప్పాలని ఉంది
మా అమ్మకి చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆవిడ వచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ వల్ల ఆ అవకాశం సరిగ్గా కుదరలేదు... రాలేదు. లండన్, అమెరికా వెళ్లారు కానీ, నాతో ట్రావెల్‌ చేసినప్పుడు ఆవిడ హ్యాపీనెస్‌ నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంటుంది. ఆ హ్యాపీనెస్‌ ఇంకా ఎక్కువగా ఇవ్వాలనుకుంటున్నాను. వీలైతే అమ్మని ప్రపంచం మొత్తం తిప్పాలని ఉంది. అలాగే నాన్నతో కలిసి ఒక వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాను. ఇద్దరం కలిసి ఆ వ్యాపారాన్ని పెద్ద సామ్రాజ్యంలా విస్తరింపజేయాలన్నది నా కల.

– డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement