ఉమెన్‌ టాప్‌గన్‌గా...  భావనాకాంత్‌ | Bhawana Kanth becomes India first woman top gun | Sakshi
Sakshi News home page

ఉమెన్‌ టాప్‌గన్‌గా...  భావనాకాంత్‌

Sep 27 2026 4:59 AM | Updated on Sep 27 2026 4:59 AM

Bhawana Kanth becomes India first woman top gun

శౌర్య పుత్రికలు

‘మా అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అమ్మాయిల తల్లిదండ్రులు తరచూ చెప్పే మాట ఇది... కాని కొందరు అమ్మాయిలు ‘కంటికి రెప్పలా కాదు..దేశాన్ని రక్షించే కవచంలా మారుతాం.’ అని భావించారు. అలానే తమని తాము నిరూపించుకున్నారు. భారత రక్షణ దళంలో త్రివర్ణ పతాకం తలెత్తుకునేలా అప్రతిహత విజయాలను అందుకుంటున్నారు. నేడు ‘ఇంటర్నేషనల్‌ డాటర్స్‌ డే.’ ఈ సందర్భంగా సరిహద్దు రూపురేఖల్ని మార్చేసిన మన ధైర్యశాలులైన కూతుళ్ల అసాధారణ విజయాలు, వారికి వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రుల స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం...

ఉమెన్‌ టాప్‌గన్‌గా... భారత వైమానిక దళంలో మరచిపోలేని సంవత్సరంగా 2026 నిలిచింది. కంబాట్‌ మిషన్‌ నిర్వహించేందుకు మహిళా ఫైటర్‌ పైలట్‌ భావనాకాంత్‌ (33) అర్హత సాధించారు. ఈ ఏడాది గ్వాలియర్‌లోని టాక్టీస్‌ అండ్‌ ఎయిర్‌ కంబాట్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో అత్యంత కఠినమైన ఫైటర్‌ కంబాట్‌ లీడర్‌ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. అందుకే ఆమెను ‘ఇండియన్‌ ఫస్ట్‌ ఉమెన్‌ టాప్‌ గన్‌’గా అభివర్ణించారు.

గర్వంగా ఉంది 
‘భావన చిన్నప్పటి నుంచే ఫైటర్‌ పైలట్‌ కావాలని కలలు కనేది. కాని అది అబ్బాయిలు ఎంచుకునే కెరీర్‌. అయతే తన ఆలోచన భిన్నంగా ఉన్నందుకు నేను సంతోషించా. చిన్నప్పటి నుంచే తనకి ఫ్లైయింగ్‌ అంటే ఇష్టం. ఈరోజు భారత దేశంలో తొలి మహిళా టాప్‌గన్‌గా పేరు తెచ్చుకుంది. ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది?’
– తేజ్‌ నారాయణ కాంత్, భావన తండ్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement