కొత్త క్రెడిట్‌ కార్డు.. యూపీఐ పేమెంట్లపై క్యాష్‌బ్యాక్‌ | No annual fee cashback Axis Bank super money credit card | Sakshi
Sakshi News home page

కొత్త క్రెడిట్‌ కార్డు.. యూపీఐ పేమెంట్లపై క్యాష్‌బ్యాక్‌

May 26 2025 8:02 AM | Updated on May 26 2025 8:06 AM

No annual fee cashback Axis Bank super money credit card

ముంబై: యాక్సిస్‌ బ్యాంక్‌ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్‌ ఫస్ట్‌ యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ‘సూపర్‌.మనీ’ భాగస్వామ్యంతో కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును విడుదల చేసింది. ‘యాక్సిస్‌ బ్యాంక్‌ సూపర్‌.మనీ రూపే క్రెడిట్‌ కార్డ్‌’ అన్నది రూపే నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. యూపీఐ చెల్లింపులకు, పీవోఎస్‌ టెర్మినళ్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఏటీఎంలలో దీన్ని వినియోగించుకోవచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 

కార్డు దారులు సూపర్‌.మనీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. దీని సాయంతో స్కాన్‌ చేసి చెల్లింపులు చేస్తే 3 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇతర విభాగాల్లో ఈ కార్డుతో చేసే వ్యయాలపై ఒక శాతం క్యాష్‌ బ్యాంక్‌ లభిస్తుంది. ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా జీవితకాలం ఉచిత సదుపాయంతో ఈ కార్డు లభిస్తుందని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement