వజ్రాల వేలం.. పోలో అంటూ వచ్చిన వ్యాపారులు | NMDC Conducts E Auction Of Panna Daimonds | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎండీసీ వజ్రాల వేలానికి భారీ స్పందన

Mar 11 2022 8:22 AM | Updated on Mar 11 2022 8:33 AM

NMDC Conducts E Auction Of Panna Daimonds - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ ఇటీవల నిర్వహించిన వజ్రాల వేలానికి మంచి స్పందన లభించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల నుంచి వెలికితీసిన 8,337 క్యారట్ల రఫ్‌ డైమండ్లకు నిర్వహించిన ఈ–వేలంలో సూరత్, ముంబై, పన్నా ప్రాంతాల్లోని వర్తకులు పాల్గొన్నట్లు సంస్థ తెలిపింది. 2020 డిసెంబర్‌ ముందు వెలికి తీసిన వజ్రాలను ఇందులో విక్రయించినట్లు పేర్కొంది. 

ఈ వజ్రాల వేలానికి నూటికి నూరు శాతం బిడ్లు వచ్చినట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ సుమీత్‌ దేవ్‌ తెలిపారు. దేశీయంగా 90% మేర వజ్రాల వనరులు మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఎన్‌ఎండీసీకి చెందిన పన్నా గనుల్లో ఏటా 84,000 క్యారట్ల డైమండ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. దేశంలో యాంత్రీకరించిన వజ్రాల గని ఇదొక్కటే.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement