
మహీంద్రా తన ప్రసిద్ధ ఆఫ్-రోడర్ అయిన థార్ (Mahindra Thar) రిఫ్రెష్ వేరియంట్‌ను (facelift) భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కొత్త థార్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ అప్డేట్ మోడల్, థార్ కోర్ బాక్సీ డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే, రోజువారీ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక సౌకర్యాలు, కనెక్టివిటీ ఫీచర్లు, కొంతమేర ఎక్స్టీరియర్ మార్పులతో వచ్చింది.
ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లు
ఇంటీరియర్‌లో పెద్దదైన 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ (ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేసహా), రియర్ ఏసీ వెంట్స్, స్లైడింగ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, రీడిజైన్ అయిన డాష్‌బోర్డ్, కొత్త స్టీరింగ్ వీల్, రీ-లొకేట్ చేసిన పవర్ విండో స్విచ్‌లు ఉన్నాయి.
ఇక ఎక్స్టీరియర్ విషయానికి వస్తే బాడీ-కలర్ ఫ్రంట్ గ్రిల్, వాషర్‌తో రియర్ వైపర్, స్పేర్ వీల్ హబ్‌లో పార్కింగ్ కెమెరా, కొత్తగా టాంగో రెడ్, బాటిల్ షిప్ గ్రే కలర్ షేడ్లు కొత్త వేరియంట్లో అప్డేట్ అయ్యాయి.
ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్
థార్ మూడు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి.. 2.0-లీటర్ ఎంస్టాలిన్ పెట్రోల్, 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్, డీ117 సీఆర్డీఈ డీజిల్. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తాయి. డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో ఆర్డబ్ల్యూడీ, డ్రైవ్ లైన్ డిస్‌కనెక్ట్ ఫీచర్‌తో కూడిన 4x4 వేరియంట్లు ఉన్నాయి. వీటివల్ల థార్‌ను సిటీ వాహనంగానూ, వీకెండ్ ఆఫ్-రోడర్‌లాగానూ ఉపయోగించవచ్చు.
ధరలు (ఎక్స్-షోరూమ్)
ఎంట్రీ-లెవల్ ఏఎక్స్టీ ఆర్డబ్ల్యూడీ ఎమ్టీ ట్రిమ్ ధర రూ. 9.99 లక్షలు.
టాప్-ఎండ్ ఎల్ఎక్స్టీ 4డబ్ల్యూడీ ఏటీ ట్రిమ్ ధర రూ. 16.99 లక్షలు
4డబ్ల్యూడీ ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ. 16 లక్షలు
సౌకర్యం & ప్రాక్టికాలిటీ:
కొత్తగా A-పిల్లర్ గ్రాబ్ హ్యాండిల్స్, ఇంధన మూతకు ఇంటీరియర్ ఓపనింగ్ మెకానిజం, అదనంగా యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్ వంటివి జోడించడం వల్ల రోజువారీ ఉపయోగంలో థార్ మరింత ప్రాక్టికల్‌గా మారింది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో తొలి టెస్లా కారుకు వాహన పూజ..