కోటక్‌, యాక్సిస్‌.. న్యూఫండ్‌ ఆఫర్స్‌ | New Fund Offers Kotak Multi Asset Active FoF and Axis Defense Fund | Sakshi
Sakshi News home page

కోటక్‌, యాక్సిస్‌.. న్యూఫండ్‌ ఆఫర్స్‌

Apr 13 2026 8:49 AM | Updated on Apr 13 2026 9:25 AM

New Fund Offers Kotak Multi Asset Active FoF and Axis Defense Fund

కోటక్‌ మహీంద్రా ఏఎంసీ తాజాగా మల్టీ అసెట్‌ యాక్టివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ని ఆవిష్కరించింది. ఇందులో ఏప్రిల్‌ 22 వరకు ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000గా ఉంటుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీ ఆధారిత స్కీముల యూనిట్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రిసు్కకు తగ్గట్లుగా మరింత మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్‌ లక్ష్యంగా ఉంటుంది. ఒకే ఫండ్‌ ద్వారా డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలను పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు.  
 
యాక్సిస్‌ డిఫెన్స్‌ ఫండ్‌
యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ డిఫెన్స్‌ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో)ను ప్రారంభించింది. ఈ నెల 24 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. రక్షణ రంగానికి కేంద్రం ఎంతో ప్రా ధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దేశీయంగానే అత్యాధునిక ఆయుధాల అభివృద్ధి, తయారీ దిశగా పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.

మారిన ప్రపంచ క్రమంలో రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తోంది.  2013–14 నుంచి చూస్తే రెండున్నర రెట్లు పెరిగి 2025–26 నాటికి రూ.6.8 ల క్షల కోట్లకు కేటాయింపులు పెరిగాయి. దీంతో రక్షణ రంగంలోని కంపెనీలు దీర్ఘ కాలానికి మెరుగైన అవకాశాలు కల్పిస్తుండడంతో ప్రత్యేకంగా డిఫెన్స్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్‌ను ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement