
దేశంలో అత్యంత ధనవంతుడి హోదా ముఖేష్ అంబానీ(Mukesh Ambani), గౌతమ్ అదానీల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. ఇప్పటికే భారతదేశ అపర కుబేరుడిగా ఉన్న ముఖేష్ అంబానీ తాజా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లోనూ టాప్‌లో నిలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో ఎం3ఎం ఇండియా ప్రచురించిన ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List 2025) 14వ ఎడిషన్ ప్రకారం.. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం రూ .9.55 లక్షల కోట్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.8.15 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(Gautam Adani), ఆయన కుటుంబం తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తొలిసారిగా రోష్ని నాడార్ మల్హోత్రా, ఆమె కుటుంబం రూ .2.84 లక్షల కోట్లు సంపదతో భారతదేశపు అత్యంత ధనిక మహిళగా ఖ్యాతి సంపాదించారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంఖ్య ఇప్పుడు 350 దాటింది. ఇది 13 సంవత్సరాల క్రితం జాబితా ప్రారంభమైనప్పటి నుండి ఆరు రెట్లు పెరిగింది. వారి మొత్తం సంపద రూ.167 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు సగం.
ఇదీ చదవండి: దేశపు అత్యంత యువ బిలియనీర్.. ఈ చెన్నై కుర్రాడు