
రెడ్‌మండ్ (అమెరికా): టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరిన్ని వేల మంది ఉద్యోగులను తీసివేసేందుకు కంపెనీ ఉపక్రమించింది.
ఇందులో భాగంగా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులను పంపించే ప్రక్రియ ప్రారంభించింది. ఎంత మందిని తీసివేస్తున్నదీ కంపెనీ నిర్దిష్టంగా వెల్లడించనప్పటికీ, దాదాపు 9000 మందికి నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్వాసనల తర్వాత గతేడాదితో పోలిస్తే సిబ్బంది సంఖ్య సుమారు 4 శాతం తగ్గుతుందని అంచనా.