సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం | Microsoft CEO Satya Nadella Announces Expansion Of Code Without Barrier Programme - Sakshi
Sakshi News home page

Code Without Barrier: సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం

Feb 8 2024 6:16 PM | Updated on Feb 8 2024 8:04 PM

Microsoft CEO Satya Nadella Announces Code Without Barrier Programme - Sakshi

ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్‌లకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా 'కోడ్ వితౌట్ బ్యారియర్' అనే కార్యక్రమాన్ని భారత్‌కు విస్తరింపజేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ 'సత్య నాదెళ్ల' ఇటీవలే ప్రకటించారు. కోడ్ వితౌట్ బ్యారియర్స్ అంటే ఏమిటి, దీని వల్ల ఉపయోగమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మైక్రోసాఫ్ట్ AI టూర్‌లో 1100 మంది డెవలపర్లు & టెక్నాలజీ లీడర్‌లను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా AI ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో భారతీయ డెవలపర్లు చూపుతున్న ప్రభావం గురించి మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల మాట్లాడారు.

కోడ్ వితౌట్ బ్యారియర్ కార్యక్రమం 75,000 మంది మహిళా డెవలపర్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ 2021లోనే తొమ్మిది ఆసియా పసిఫిక్ దేశాల్లో విస్తరించింది. దీని ద్వారా క్లౌడ్, ఏఐ రంగాల్లో లింగ భేదాలను తొలగించాలనేది కూడా ఇందులో ఒక ప్రధాన అంశం.

ఇదీ చదవండి: భవిష్యత్ అంతా అందులోనే!.. ఉద్యోగాలు పెరుగుతాయ్..

20 లక్షల మందికి ఏఐ శిక్షణ
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీలో రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్‌ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement