449 కిమీ రేంజ్ అందించే.. విండ్సర్ ఈవీ ప్రో: ధర ఎంతంటే? | MG Windsor EV Pro Launched In India With 449 km Range | Sakshi
Sakshi News home page

449 కిమీ రేంజ్ అందించే.. విండ్సర్ ఈవీ ప్రో: ధర ఎంతంటే?

May 6 2025 4:43 PM | Updated on May 6 2025 5:06 PM

MG Windsor EV Pro Launched In India With 449 km Range

జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా.. ఇండియన్ మార్కెట్లో విండ్సర్ ప్రో లాంచ్ చేసింది. ఇది ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది. దీని ధర రూ. 17.46 లక్షలు. ఈ ధర మొదటి 8000 మందికి మాత్రమే అని కంపెనీ వెల్లడించింది. ఆ తరువాత ధరలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది. ఇవి కాకుండా సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement