మ్యాక్స్‌లైఫ్‌ మిడ్‌క్యాప్‌ మూమెంటమ్‌ ఫండ్‌ | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌లైఫ్‌ మిడ్‌క్యాప్‌ మూమెంటమ్‌ ఫండ్‌

Published Mon, Jan 22 2024 5:57 AM

Max Life Diversifies ULIP range with an all-new Midcap Momentum Index Fund - Sakshi

మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ యులిప్‌ పాలసీదారుల కోసం ‘మిడ్‌క్యాప్‌ మూమెంటమ్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ను ప్రారంభించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 మూమెంటమ్‌ 50 ఇండెక్స్‌ను అనుసరించి ఇది పెట్టుబడులు పెడుతుంటుంది. అంటే ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే వెయిటేజీ ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. కనుక దీన్ని ఇండెక్స్‌ ఫండ్‌గా పరిగణించొచ్చు.

ఈ ఇండెక్స్‌ రాబడులు ఐదేళ్లలో ఏటా 28.7 శాతం, పదేళ్లలో ఏటా 26.7 శాతంగా ఉన్నట్టు మ్యాక్స్‌లైఫ్‌ ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ వరకు ఈ నూతన ఫండ్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతుంది కనుక రాబడులు కూడా దానినే ప్రతిఫలించే మాదిరిగా ఉంటాయని ఆశించొచ్చు. ఒక యూనిట్‌ ఎన్‌ఏవీ రూ.10. మిడ్‌క్యాప్‌ విభాగంలో వ్యూహాత్మక పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చని మ్యాక్స్‌లైఫ్‌ పేర్కొంది.   

Advertisement
 
Advertisement