
బీమా రంగంలో మరింత జవాబుదారీతనం దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) కీలక ప్రతిపాదన చేసింది. రూ.50 లక్షల వరకు క్లెయిమ్‌లకు సంబంధించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత బీమా అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ‘ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ గైడ్‌లైన్స్, 2025’ ముసాయిదాను విడుదల చేసింది.
ఇదీ చదవండి: ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్
ఫిర్యాదులను న్యాయంగా, పారదర్శకంగా, సకాలంలో పరిష్కరించేందుకు స్వతంత్ర, నిష్పాక్షిక యంత్రాంగం ఉండాలని పేర్కొంది. కార్యకలాపాలు ప్రారంభించి మూడేళ్లు దాటిన అన్ని బీమా సంస్థలకు ఈ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. బీమా సంస్థలు ఒకరికి మించి కూడా అంతర్గత అంబుడ్స్‌మన్‌ను నియమించొచ్చని తెలిపింది. ముసాయిదా మార్గదర్శకాలపై ఆగస్ట్ 17 వరకు సలహా, సూచనలను ఆహ్వానించింది.